సీనియర్ హీరో డైరెక్షన్లో నాగ చైతన్య.!

-

ఈ మధ్యకాలంలో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని వారసుడు నాగచైతన్య.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల యువసామ్రాట్ గా క్రేజ్ సంపాదించిన నాగచైతన్య… విభిన్న చిత్రాల దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.

అయితే వరుసగా సినిమాలకు ఓకే చెప్పుకుంటూ వెళ్తున్న నాగచైతన్య ఇటీవల ఒక సీనియర్ హీరో సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో నాగచైతన్య సీనియర్ హీరో దర్శకత్వంలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ ప్రస్తుతం దర్శకుడిగా మారి నాగచైతన్య తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కథ బాగా నచ్చడంతో నాగచైతన్య కూడా ఒప్పుకున్నాడని.. ఈ సినిమాకు సంబంధించి మిగతా పనులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news