నిర్మాతలను మొత్తం ముంచేశారు : మోహన్‌ బాబుపై నాగబాబు సంచలనం !

మా ఎన్నికలపై నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావని.. అతను ఫెయిల్‌ అని చురకలు అంటించారు నాగబాబు. ప్రకాశ్ రాజ్ ను తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని ఎద్దేవా చేశారు. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు నాగబాబు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని… ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవని తెలిపారు.

ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని… విద్యార్థులకు ఏం కావాలో విద్యా సంస్థ నడుపుతున్న మోహన్ బాబు కు తెలుసని చురకలు అంటించారు. అలాగే… నటీ నటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసన్నారు.

నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారని ఫైర్‌ అయ్యారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని…మీ వివాదాల్లో తప్పెవరితో తమకు తెలియదన్నారు. “విష్ణు నువ్ ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్. విష్ణు అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు” అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు నాగబాబు.