సమంతలో అది నచ్చే పెళ్లి చేసుకున్నా : నాగ చైతన్య !

-

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమా కస్టడీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉన్నాడు. తమిళ్ దర్శకుడు అయిన వెంకట్ ప్రభు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగచైతన్య నటించిన హీరోయిన్ లలో నచ్చిన క్వాలిటీ ఏమిటి అన్న ప్రశ్నకు సంధానమ్హ్ చెబుతూ సమంతలో హార్డ్ వర్క్, పూజ హెగ్డే లో స్టైల్ , కృతి శెట్టి లో ఇన్నోసెన్స్ నచ్చాయని చెప్పాడు. దీనితో తన మాజీ భార్య సమంత గురించి చెప్పిన ఆన్సర్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

సమంతలో హార్డ్ వర్క్ నచ్చే ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వీరు విడిపోయి ఎవరికి వారు వేరుగా ఉంటుంన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news