Namratha Shirodkar : పారిస్​ వీధుల్లో క్లాసీ లుక్​లో నమ్రతా శిరోద్కర్.. ఫొటోలు వైరల్

-

నమ్రతా శిరోద్కర్.. అదేనండి మన టాలీవుడ్ హ్యాండ్స్ హంక్, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి. వంశీ సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన నమ్రత.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే మహేశ్ బాబుతో ప్రేమలో పడింది. ఇక అంతే ఆ రాజకుమారుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.

ఇక అప్పటి నుంచి నమ్రత తన సమయమంతా మహేశ్​కు, పిల్లలు గౌతమ్, సితారలకే కేటాయిస్తోంది. మరోవైపు ఎన్జీవో పనుల్లోనూ బిజీగా గడుపుతోంది. ఇక సినిమా షూటింగులతో ఎప్పుడు బిజీగా ఉండే మహేశ్ తరచూ కుటుంబంతో విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా నమ్రత, మహేశ్​లు పారిస్​ వెకేషన్​లో ఉన్నారు.

పారిస్ వెకేషన్​లో ఉన్న నమ్రత తాజాగా అక్కడి ఫొటోలు షేర్ చేసింది. పింక్ కలర్ క్యాజువల్ సూట్​లో నమ్రత క్లాసీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నమ్రత లుక్​ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓ వైపు ట్రెండీగా ఉంటూనే మరోవైపు సూపర్ కూల్​గా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version