11 ఏళ్లకే శ్రీకృష్ణావతారంతో సినిమాల్లోకి నందమూరి హరికృష్ణ తెరంగేట్రం!

-

సెప్టెంబర్ 2, 1956 న కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి తారకరామారావు, బసవతారకానికి జన్మించిన హరికృష్ణ.. 1967 లోనే శ్రీకృష్ణావతారం అనే సినిమాలో నటించారు. 1970లో త‌ల్లా పెళ్ళామా చిత్రంలో సైతం బాల‌న‌టుడిగా, 1974లో తాత‌మ్మ‌క‌ల సినిమాతో పూర్తిస్థాయి న‌టుడిగా మారారు. ఆ తర్వాత రామ్ రహీమ్, దాన వీర శూర కర్ణ చిత్రాల్లో నటించిన హరికృష్ణ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.


1998లో శ్రీ‌రాముల‌య్య సినిమాలో స‌త్యం పాత్ర‌లో జీవించేశారు. 1999 సంవ‌త్స‌రంలో ఆయ‌న న‌టించిన సీతారామ‌రాజు చిత్రం ఆయ‌న‌ని జ‌నాల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేసింది.
2002లో లాహిరి లాహిరి లాహిరిలో, శివ‌రామ‌రాజులో న‌టించారు.2003 సంవ‌త్స‌రంలో సీత‌య్య సినిమాలో ఆయ‌న చేసిన సీత‌య్య పాత్ర ప్ర‌తి తెలుగువాడికి గుర్తుండిపోయేలా నటనను ప్రదర్శించారు. 2003 లో టైగ‌ర్ హరిశ్చంద్ర‌ప్ర‌సాద్ , 2004లో స్వామి, 2005 సంవ‌త్స‌రంలో శ్రావ‌ణ‌మాసం తో సినిమాలు దాదాపుగా ఆపేశారు.

హ‌రికృష్ణ న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటారు. క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రికృష్ణ దాన‌వీర శూర‌క‌ర్ణ అనే చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version