పుంగనూరు లో ఈ రోజు చంద్రబాబు నాయుడును ఎంటర్ అవ్వకుండా వైసీపీ నేతలు దాడులు చేసిన విషయం తెలిసిందే, అదే సమయంలో టీడీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో పొగవ్వడంతో పోలీసులు ఇరువర్గాల వారిని కంట్రోల్ చేశారు. కాగా ఈ దాడిపై నారా లోకేష్ స్పందిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై భారీగా విమర్శలు చేశారు. వైసీపీ గుండాలు దాదాగిరి చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై దాడి చేస్తుంటే పోలీసులు ఏమిచేస్తున్నారంటూ విమర్శలకు దిగాడు లోకేష్. ఈ రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న చంద్రబాబుకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు లోకేష్. ఇది రాజ్యాంగం లో ఉన్న విధంగా పాలన చేస్తున్నట్లు లేదు రాజారెడ్డి రాక్షస పాలనలా ఉందంటూ రెచ్చిపోయి మాట్లాడారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలకు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాం : నారా లోకేష్
-