బ్రేకింగ్: కడప గడప తొక్కనున్న లోకేష్.. ప్రోగ్రాం ఫిక్స్!

-

అవినీతి ఆరోపణలు, అక్రమాల నేరాలతో అరెస్టయిన తమ పార్టీ నాయకులను కలుసుకోవడానికి అత్యుత్సాహం చూపిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప గడప తొక్కనున్నారు. ఈఎస్ఐ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి ప్రయత్నించి నిరాశకు గురైన లోకేష్… జేసీ బ్రదర్స్ ని అయినా కలవాలని, పరామర్శించాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం కడపకు బయలుదేరుతున్నారు!

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ లో అరెస్టు చేసిన అనంతరం పోలీసులు వారిని అనంతపురానికి తరలించిన సంగతి తెలిసిందే. దాంతో… అనంతపురానికి వెళ్లి జేసీ ఫ్యామిలీని పరామర్శించాలని తొలుత లోకేష్ భావించారు. అయితే… అయితే పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జేసీ ప్రభాకర్, అస్మిత్‌ను కడప జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయన కడపకు వెళ్లనున్నారు. దీంతో లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దీంతో… ఆదివారం అనంతపురానికి పులొస్తుందని సంబరపడిన లోకేష్ అభిమానులు… కడప గడపలో పులిబిడ్డ అంటూ కామెంట్లు చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version