Breaking : సీఎం జగన్‌కు నారా లోకేశ్‌

-

విమర్శలు గుప్పిస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లేఖ రాశారు. ఏపీలో సామాజిక పింఛనుదారులకు ప్రభుత్వం నోటీసులు పంపిందన్న నేపథ్యంలో నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అడ్డగోలు నిబంధనలు, అబద్ధపు నోటీసులతో ఇష్టారాజ్యంగా పింఛన్ల తొలగింపు ఆపాలని డిమాండ్ చేశారు. అధికార పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరిచ్చిన హామీలు మర్చిపోయారా? అని లోకేశ్ ప్రశ్నించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి పింఛన్ల విషయంలో నయవంచనకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రూ.200గా ఉన్న పింఛనును 10 రెట్లు పెంచి రూ.2 వేలు చేసిందని లోకేశ్ పేర్కొన్నారు. “కానీ మీరు పెన్షన్ ను రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు.

అధికారంలోకి రాగానే వయో పరిమితి నిబంధనలతో దాదాపు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారు. పెంచాల్సిన పింఛను సొమ్ము పెంచకపోగా, అనేక సంవత్సరాలుగా అందుతున్న పింఛన్లనే రద్దు చేసేందుకు ఇష్టంవచ్చినట్టు నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి పింఛన్లు రద్దు చేయాలనుకోవడం చాలా అన్యాయం. 20 ఏళ్ల నుంచి పెన్షన్లు అందుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తమ ఆసరా తొలగించి ఉసురు తీయొద్దని వేడుకోవడం మీకు వినిపించడంలేదా సీఎం గారూ? శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం మారడికోట పంచాయతీలో సెంటు భూమి లేని నిరుపేదలకు వేల ఎకరాల భూములు ఉన్నాయని పింఛన్లు తొలగించారు. వారికి పింఛన్లు ఇవ్వొద్దులే కానీ… ఆ వేల ఎకరాల్లో 90 శాతం మీరే తీసుకుని 10 శాతం భూములు వారికి ఇప్పించండి చాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version