ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగం, పోలీసులను వాడుకొని పోటీ లేకుండా చేయాలని హిట్లర్ గిరి ఎందుకు ? అని జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా మీవైపు ఉంటే తిరుపతి ఉప ఎన్నికలకి దింపిన వేలాది మంది దొంగ ఓట్ల పర్యాటకులు… టిడిపి పోటీచేయని బద్వేలు ఉప ఎన్నికలకీ ఎందుకు దింపాల్సి వచ్చింది జగన్ గారూ! అంటూ మండిపడ్డారు.
స్థానిక సంస్థల్లో 85 శాతం ప్రజలు మా వైపే అని మీరు ప్రకటిస్తారు.. మళ్ళీ.. దొంగ ఓట్లు గుద్దుకుంటారని ఫైర్ అయ్యారు. గిరిజన మహిళ శిరీషని వైసీపీ నేత వెంకన్న ఎందుకు బెదిరించారు ? గురజాల నగరపంచాయతీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన మైనారిటీ మహిళ నజీమున్ పై ఎందుకు దాడి చేశారు ? అని నిలదీశారు. ” వైసీపీది అసలు సిసలైన ప్రజాబలమైతే.. పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ స్థానం వరకూ గెలుపు కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాల్సిన అవసరమేంటి? ఎన్నికల కమీషన్, అధికారయంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని పోటీయే లేకుండా చేయాలనే ఈ హిట్లర్ గిరీ ఎందుకు? ” అంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలంతా మీవైపు ఉంటే తిరుపతి ఉప ఎన్నికలకి దింపిన వేలాది మంది దొంగ ఓట్ల పర్యాటకులు… టిడిపి పోటీచేయని బద్వేలు ఉప ఎన్నికలకీ ఎందుకు దింపాల్సి వచ్చింది @ysjagan గారూ! స్థానిక సంస్థల్లో 85 శాతం ప్రజలు మా వైపే అని మీరు ప్రకటిస్తారు.(1/5) pic.twitter.com/7RPzc5TCuE
— Lokesh Nara (@naralokesh) November 5, 2021