ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సారి మండిపడ్డారు. ట్విట్టర్ వేధికగా అందరిలోనూ ఒకటే ప్రశ్న ఉదయిస్తోందని నారా లోకేస్ తెలిపారు. ఎన్నికల ముందు వరకు జై అమరావతి అన్న వైఎస్ జగన్ ఇప్పుడు మూడు ముక్కలాట ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సామాన్యులు సంధించిన పలు ప్రశ్నాస్త్రాలను వీడియో రూపంలో వరుస ట్వీట్లు చేశారు. అమరావతి రాజధానిగా పనికిరాదని ఇప్పుడు చెబుతున్న జగన్, నాడు అసెంబ్లీలో ఏంచెప్పారని ఓ మహిళ వీడియోలో ప్రశ్నించింది.
రాజధాని కోసం ఉద్యమిస్తున్న వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న పృథ్వీ ఇప్పుడెక్కడున్నాడో తెలియదని వ్యాఖ్యానించింది. అలాగే లోకేస్ మరో ట్విట్‌లో అభివృద్ధి, ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభిృద్ధి అని జగన్ అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని, ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే జగన్ దండయాత్ర విషయమై స్పష్టత వచ్చేసిందంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
అందరి ప్రశ్నా ఒక్కటే ఎన్నికల ముందు జై అమరావతి అన్న @ysjagan గారు ఇప్పుడు మూడు ముక్కలాట ఎందుకు మొదలుపెట్టారు?(1/3)
Video Part 1 pic.twitter.com/sJS5yLxOy4— Lokesh Nara (@naralokesh) January 31, 2020
ఉత్తరాంధ్రపై @ysjagan గారి దండయాత్ర ప్రారంభమైంది. అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని జగన్ గారు అన్నప్పుడే అనుమానం వచ్చింది.(1/2) pic.twitter.com/TzsiTwpwWB
— Lokesh Nara (@naralokesh) January 31, 2020