మార్స్ నుంచి వచ్చిన తొలి సెల్ఫీ…!

-

మార్స్ ఉపరితలంపై అన్వేషిస్తున్న నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్, ఎర్ర దుమ్ముతో కప్పబడిన ఒక కొత్త సెల్ఫీని క్లిక్ చేసి పంపింది. ‘మేరీ ఆన్నింగ్’ అనే కొత్త ప్రదేశాన్ని పరిశీలించింది. క్యూరియాసిటీ రోవర్ జూలై నుండి అంగారక గ్రహంపై అన్వేషిస్తుంది, డ్రిల్ నమూనాలను సేకరించి విశ్లేషిస్తుంది. నాసా ప్రకారం, క్యూరియాసిటీ రోవర్ పంపిన ఈ తాజా చిత్రం “ఇమేజింగ్ స్పెషలిస్టులచే పొందుపరిచిన 59 ఫొటోస్” రూపొందించబడింది.

ఈ సెల్ఫీ అక్టోబర్ 25 న తీసింది. మార్స్ ఉపరితలంపై క్యూరియాసిటీ మిషన్ వెళ్ళిన 2,922 వ మార్టిన్ రోజు ఈ ఫోటో తీసింది. క్యూరియాసిటీ రోవర్ అనే ఒక ట్విట్టర్ ఖాతాలో దీని పోస్ట్ చేసారు. క్యూరియాసిటీ నవంబర్ 2011 లో ప్రారంభించారు. ఇది ఆగస్టు 2012 లో అంగారక గ్రహంపైకి దిగింది. అప్పటి నుండి, క్యూరియాసిటీ రోవర్ రెడ్ ప్లానెట్‌లో మానవ జీవితానికి అనుగుణమైన ప్రదేశాలను అన్వేషిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version