బిజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక కోసం కసరత్తు.. రేసులో దక్షిణాది నేతలు..మనోళ్లకి ఛాన్స్ ఉంటుందా..?

-

భారతీయ జనతాపార్టీ.. క్రమశిక్షణ, సిద్దాంతాలు కల్గిన పార్టీ.. అలాంటి పార్టీ నుంచి ఎందరో నేతలు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగారు.. అలాంటి పార్టీలో నూతన జాతీయ అధ్యక్షులు ఎవరనే చర్చ జరగుతోంది.. దీనిపై భారీ కసరత్తే జరుగుతోంది.. ఇంతకీ జేపీ నడ్డా వారసులెవ్వరు..? సౌత్ లీడర్స్ కు అవకాశం ఉంటుందా..? లెట్స్ వాచ్..

బిజేపీ జాతీయ అధ్యక్షునిగా ప్రస్తుతం జేపీ నడ్డా కొనసాగుతున్నారు.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. గ్రామ, మండల స్థాయి నుంచి అధ్యక్షులను ఎన్నకుంటున్నారు.. ఇదే క్రమంలో రాష్ట, జాతీయ స్థాయి అధ్యక్షుల ఎంపిక ఉంటుంది.. జాతీయ అధ్యక్షునికి మూడేళ్ల పదవి కాలం ఉంటుంది.. ఒకరు గరిష్టంగా రెండేసార్లు చెయ్యొచ్చు కూడా… 2020 జనవరిలో జేపీ నడ్డా అధ్యక్షునిగా ఎంపికయ్యారు..తిరిగి కొన్ని సడలింపులు ఇచ్చి.. ఆయనే మళ్లీ కొనసాగించారు.. ఆ సమయంలో కేంద్రం పెట్టుకున్న కొన్ని లక్ష్యాలను నడ్డా పూర్తి చేశారు.. ఈ క్రమంలో నూతన అధ్యక్షుని కోసం కసరత్తు జరుగుతోంది..

జాతీయ అధ్యక్షులంటే.. బలమైన నేత.. క్షేత్రస్థాయి పరిచయాలు ఉండాలి.. దీంతో సరైన నేత కోసం కొన్ని రోజుల నుంచి కసరత్తు జరుగుతోంది.. ఇదే సమయంలో బలమైన నేతల కోసం బిజేపీ సౌత్ వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది.. తూర్పు భారతదేశం, దక్షిణాదిన పార్టీ కొంచం బలహీనంగా ఉంటుందన్న ప్రచారం జరుగతున్న నేపథ్యంలో… దక్షిణాధి రాష్టాల నుంచే అధ్యక్షున్ని ఎన్నుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్టాల నుంచే నేతల ఉండే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది..

మహిళల పేరును కూడా నేతలు పరిశీలిస్తున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుందర రాజే పేరు పరిశీలన చేసినా.. ప్రస్తుతం ఆమె రేస్ లో లేనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.. ఓబీసీ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలనే ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. రాధామోహన్ సింగ్, సుధాయాదవ్,వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్ వంటి నేతలు పేర్లు వినిపిస్తున్నాయి.. వారితోపాటు మనోహర్ లాల్ ఖట్టర్, చౌహన్ వంటి వారు సంఘ్ నుంచి వచ్చినవారు కావడంతో వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. మొత్తంగా ఈ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version