BREAKING : గుజరాత్ తీరంలో ₹602 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

-

దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈరోజు.. గుజరాత్‌ తీరంలో ఏకంగా 86 కిలోలు డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురు కాల్పులకు పాల్పడ్డారని.. వారిని చుట్టిముట్టిన అధికారులు 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిని పాకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.

ఇటీవల గుజరాత్‌, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ ల్యాబ్‌ల గుట్టును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రట్టు చేసి మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్‌ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version