ఢిల్లీలో వాయు కాలుష్యం.. కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

-

దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం రాకముందే వాయు కాలుష్యం భయపడుతోంది. గత ఐదు రోజులుగా గాలి నాణ్యత సూచి దారుణంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. పర్యావరణ చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని మండిపడింది ధర్మాసనం.

రైతులు పంట వ్యర్ధాలు దహనం చేయడం పై కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం. అధికారాలు లేని పర్యావరణ చట్టాలను రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కమీషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) చట్టం ప్రకారం పంట వ్యర్ధాలు తగులబెట్టినందుకు జరిమానా విధించాలని సూచించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించకుండానే (CAQM) చట్టాన్ని రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

దీంతో 10 రోజుల్లో CAQM చట్టం ప్రకారం జరిమానా ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది కేంద్రం. పంట వ్యర్ధాల దహనం, ఇటుకల బట్టీల నిర్వహణని నిలిపివేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను పంజాబ్, హర్యానా రాష్ట్రాలు పాటించడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్.

కాలుష్య కారకులపై ఎందుకు శిక్షార్హమైన చర్యలు తీసుకోకూడదని.. వివిధ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కాలుష్య కారకులపై తగిన చర్యలు తీసుకోనందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. చట్టాలు అమలులో ఉన్నప్పటికీ.. గణనీయమైన ప్రాసిక్యూషన్‌లు జరగలేదంది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version