లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో అవినీతి కేసు

-

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై సిబిఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రిక్రూట్మెంట్ కుంభకోణంపై ఈ కేసు బుక్ అయింది. లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సిబిఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే ఇటీవలే దాణా కుంభకోణంలో వారం క్రితమే లాలూ బెయిల్ పై విడుదలై జైలు నుండి బయటకు వచ్చారు.

 

లాలూ సీఎంగా ఉన్న సమయంలో 1990లో బీహార్ లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సిబిఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.డోరండా ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్లను చట్టవిరుద్ధంగా విత్డ్రా చేశారని ఆరోపణల నేపథ్యంలో సిబిఐ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ఐదేళ్లపాటు శిక్షపడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు. ఇప్పుడు మళ్లీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన రిక్రూట్మెంట్ కుంభకోణంపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version