Ayodhya Bala Rama : అయోధ్య బాల రాముడి పేరు మారింది. అయోధ్య రామ మందిరంలో కొలువైన బాల రాముడిని ఇకనుంచి ‘బాలక్ రామ్’ గా పిలవనున్నట్లు రామ జన్మభూమి ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని చెప్పారు.
కాగా, అయోధ్య రాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిల 250 కోట్ల ఏళ్ల నాటిదని నిపుణులు తేల్చారు. వాతావరణ మార్పులకు లొంగకపోవడం దీని ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఇక అటు బలరాముని రూపంలో ఉన్న శ్రీరాముని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.
భక్తులు తెల్లవారుజామున మూడు గంటలకే రామ మందిరం వద్దకు ఉదయం 7 గంటల నుంచి రామ మందిరంలోకి అనుమతి ఇవాళ ఫస్ట్ రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్య లో బాల రాముని ఇప్పటివరకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.