అయోధ్య రామాలయ ఆహ్వాన పత్రిక ఎలా ఉందో చూశారా?

-

అయోధ్య రాముడి ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వేళవుతోంది. జనవరి 22వ తేదీన జరగబోయే ఈ బృహత్తర కార్యక్రమం కోసం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న ఈ కల మరో పది రోజుల్లో సాకారం కాబోతోంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అతిరథ మహారథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

రామ జన్మభూమి ట్రస్టు ముఖ్య అతిథులకు ఆహ్వానాలను పంపిస్తోంది. ఇందులో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయితే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రామ జన్మభూమి ట్రస్టు ఈ ఆహ్వాన పత్రికలను తాజాగా ఆవిష్కరించింది. ఈ పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి లిపిలో లిఖించారు.

మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్‌ నిమంత్రన్‌ (అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం) అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర ముఖభాగాన్ని ముద్రించారు. ఇక ఇన్విటేషన్ తెరవగానే రెండో పేజీలో అందమైన బాలరాముడి రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత పేజీలో ప్రాణప్రతిష్ఠకు హాజరు కానున్న విశిష్ట అతిథుల పేర్లున్నాయి. జనవరి 22వ తేదీన ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిరనక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వానపత్రికలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version