లోక్ సభ అభ్యర్థుల నాలుగో జాబితా ప్రకటించిన బీజేపీ..!

-

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 15 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది. పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ప్రముఖ సినీనటి రాధికా శరత్ కుమార్ విరుదునగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్.శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేశారు. పుదుచ్చేరీ లోక్సభ స్థానం నుంచి నమశ్శివాయం బరిలోకి దిగుతున్నారు.

తమిళనాడు, పుదుచ్చేరి అభ్యర్థుల వీరే :

  • విరుదునగర్-రాధికా శరత్ కుమార్
  • మదురై-రామ శ్రీనివాసన్
  • చిదంబరం – పి. కాత్యాయని
  • తిరువళ్లూరు పొన్. వి. బాలగణపతి
  • చెన్నై నార్త్-ఆర్.సి. పాల్ కనగరాజ్
  • తిరువన్నామలై ఎ. అశ్వత్థామన్
  • నమక్కల్- కె.పి. రామలింగం
  • తిరుప్పూర్ – ఎ.పి. మురుగనందం
  • పొల్లాచ్చికె. వసంతరాజన్
  • కరూర్ -వి.వి. సెంథిల్నాథన్
  • నాగపట్టిణం – (ఎస్సీ) ఎం రమేశ్
  • తంజావూరు -ఎం. మురుగనందం
  • శివలింగ-దేవనాథన్ యాదవ్
  • పుదుచ్చేది – ఏ.నరసింహన్

Read more RELATED
Recommended to you

Exit mobile version