IPL 2023 : ముంబైకి గుడ్ న్యూస్..బుమ్రా వచ్చేశాడు

-

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగులు తేడాతో పరాజయం పారైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వదేరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ముంబై 152/9 రన్స్ కి పరిమితమైంది.

గుజరాత్ బౌలర్లలో నూర్ 3, రషీద్, మోహిత్ చెరో 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు. కాగా,బుమ్రా చాలారోజుల తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. అయితే బూమ్రా మ్యాచ్ ఆడడం లేదు. ఐపీఎల్ 2023లో భాగంగా ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూసేందుకు స్టేడియంకు వచ్చాడు. స్టేడియంలో అభిమానుల మధ్య ముంబై పెసర్ సందడి చేశాడు. వెన్ను శస్త్ర చికిత్స తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బూమ్రా తొలిసారిగా కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version