గుడ్ న్యూస్ .. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

-

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వినియోగదారులకు ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా తీపి కబురు అందించాయి. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకు‌న్నట్లు తెలిపాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను 30 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. జులై 1వ తేదీ (ఇవాళ్టి) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయని వెల్లడించాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.30 తగ్గి రూ.1646కు చేరుకుంది.

మే నెలలోనూ కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు ప్రకటించాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. 19 కిలోల వాణిజ్య ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మే 1 నుంచి దిల్లీలో రూ.1764.50 ఉండగా, రూ.19 తగ్గడం వల్ల రూ.1745.50కి అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు 30 రూపాయలు తగ్గడంతో రూ.1646లు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version