దిల్లీ లిక్కర్ కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురని అరెస్టు చేసింది. మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా ఈడీ నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసులో సిసోదియా పాత్రపై అభియోగాలను ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది.

ఛార్జ్‌షీట్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చార్జ్‌షీట్‌లో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. కవితపై గత ఛార్జ్‌షీట్‌లోని అంశాలనే ఈడీ మరోసారి ఈ ఛార్జ్‌షీట్‌లోనూ ప్రస్తావించింది.

‘‘సౌత్‌ గ్రూప్‌, ఆప్‌ నేతలకు మధ్య ఒప్పందం ఉంది. దిల్లీ మద్యం పాలసీలో సిసోదియా అక్రమాలకు పాల్పడ్డారు. సౌత్‌ గ్రూపునకు లబ్ధికలిగేలా పాలసీ రూపొందించారు. సౌత్‌ గ్రూప్‌ నుంచి ఆప్‌ నేతలకు ముడుపులు ముట్టాయి’’ అని ఛార్జ్‌షీట్‌లో ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. దర్యాప్తులో భాగంగా 51 మందిని ప్రశ్నించామని పేర్కొంటూ వారి వివరాలను ఛార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించింది. అయితే, ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో ఎమ్మెల్సీ కవిత పేరు మాత్రం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version