ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా గెలిచినా వదిలిపెట్టేది లేదు : బీజేపీ

-

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవగౌడ మన కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ కూడా ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్కీ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మొత్తం కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే ఓ మహిళ కిడ్నాప్ కేసులో నిన్న జేడీయూ ఎమ్మెల్యే హెచీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను రప్పించేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఇంటర్ పోల్ నుంచి ‘బ్లూ కార్నర్ నోటీసు’ కోరే అవకాశముంది. ఈ వ్యవహారంపై బీజేపీ నేత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజ్వల్ తప్పించుకునేందుకు సీఎం సహాయం చేశాడని ఆరోపించారు. ప్రజ్వల్ పై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా చెబుతున్నా.. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version