ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్లండి.. భారత యువతకు బిల్ గేట్స్ సూచన

-

ప్రపంచ కుబేరులలో ఒకరు మైక్రోసాప్ట్, సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని.. పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని కోరారు. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్ గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్న పై బిల్ గేట్స్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులు గొప్ప ప్రతిభావంతలు.. సులభంగా సమస్యలను పరిస్కరిస్తారు. వారి ఆవిస్కరణలను చూస్తే ఈ విషయం అవగతవుతుంది. డిజిటల్ రంగంలోనూ భారత్ దూసుకెళ్తోంది. ఆధార్ లాంటి సంబంధిత కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం అంటూ ఆయన ప్రశంసించారు. భారత్ లోని యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి పరిశీలించండి. అక్కడి వారు ఎంతో తెలివైన వారు. కానీ వారికి అవకాశాలు తక్కువ. మంచి విద్య అందడం లేదు. వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని యువత గమనించాలని సూచించారు బిల్ గేట్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version