నిలకడగా బంగారం, వెండి ధరలు..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా ఉండి. ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరతోనే కొనసాగుతుంది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం ధర నిలకడగా ఉండగా.. వెండి ధర మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిన్న రూ. 30 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,290కు చేరింది.. నేడు కూడా అదే ధర కొనసాగుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర నిన్న రూ. 40 తగ్గడంతో రూ. 48,850 కు చేరుకుంది.. కాగా, ఇవాళ కూడా అదే ధరతో నిలకడగా ఉంది.

బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం కొంచం తగ్గింది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. దీంతో ధర రూ. 68,000కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 150 మేర పెరగడంతో రూ.54,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కి చేరింది. ఇకపోతే అంతర్జాతీయంగా బంగారం ధర 1926 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 26.60 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news