ఇండియాలో కొత్తగా 19,673 కరోనా కేసులు, 45 మరణాలు

-

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,673 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,19,811 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,676 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.5 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 45 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,26, 357 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,955 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,33,49, 778 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 204 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 31 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version