జమ్ముకశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 72 గంటల్లో మూడోసారి

-

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రదాడులు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ అమరులయ్యారు. ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.

ఇటీవలే యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున జరిగిన ఈ ఘటన మరవకముందే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లోని ఒక ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంటి యజమాని గాయాలపాలయ్యారు. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు, పారామిలిటరీ బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version