జల్లికట్టుకు అనుమతి ఇచ్చిన క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్

-

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా గోబ సందిరం గ్రామంలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో జల్లికట్టు నిర్వహణకు అనుమతులు ఇవ్వలేదని వీరంకం సృష్టించారు స్థానికులు. క్రిష్ణగిరి జిల్లా హునూరు జాతీయ రహదారిపై రుణరంగం సృష్టించారు. పోలీసులపై రాళ్ల దాడి చేసి, పలు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 15 మందికి పైగా పోలీసులకు గాయాలు అయ్యాయి. గాయాల పాలైన పోలీసులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. యువకులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. జల్లికట్టు నిర్వాహకులతో చర్చించి అనుమతి ఇచ్చారు క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి, ఎస్పీ సరోజ కుమార్ ఠాగూర్. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి. ప్రస్తుతం శాంతి భద్రతల సమస్యగా మారినందున తనిఖీ చేయకుండానే అనుమతి మంజూరు చేయడానికి కలెక్టర్ అంగీకరించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version