మణిపుర్​లో మరణమృదంగం.. చర్చిలోకి చొరబడి కాల్పులు.. 9 మంది మృతి

-

మణిపుర్​లో మరోసారి మరణమృదంగం మోగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ అల్లర్లు చల్లారడం లేదు. తాజాగా జరిగిన అల్లర్లలో 9 మంది మరణించారు. మణిపుర్​లోని ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 9 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తూర్పు ఇంఫాల్​లోని ఖమెన్​లోని ఓ చర్చిలో మంగళవారం రాత్రి దుండగులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగే సమయంలో చర్చిలో 25 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ప్రస్తుతం ఇంఫాల్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్​ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గత కొంతకాలంగా మణిపుర్​లో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగడం వల్ల ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్​లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. వివిధ గిరిజన సంఘాలతో భేటీ అయి శాంతి సయోధ్యలు నెలకొల్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మణిపుర్​ గవర్నర్​ ఆధ్వర్యంలో ‘శాంతి కమిటీ’ని ఏర్పాటు చేశారు. అయినా అక్కడి అల్లర్లు అదుపులోకి రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version