ఒకరోజు ఉపవాస దీక్షకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. వారికి స్వయంగా టీ !

-

సెప్టెంబర్ 20 న వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందే సందర్భంలో పెద్దల సభలో ప్రతిపక్ష ఎంపీలు తనతో వ్యవహరించిన ప్రవర్తనకు వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాసం పాటించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతకు ముందు రాజ్యసభ నుంచి సస్పెన్షన్ కు గురయి, పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేస్తున్న ఎంపిలకు స్వయంగా డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ టీ ఇచ్చి పరామర్శించడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం మీద సస్పెండ్ అయిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రిపున్ బోరా స్పందించారు. హరివంష్ జీ మమ్మల్ని సహోద్యోగిగా కలవడానికి వచ్చారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కాదని పేర్కొన్నారు.

దీంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఇచ్చిన టీ తాగడానికి సస్పెండై గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తున్న ఎంపీలు నిరాకరించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తమ నిరసన దీక్షను పక్కదోవపట్టించేందుకు, మీడియాను తీసుకువచ్చి ఈ ఎత్తుగడను అవలంబించినందున, ఆయన ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించామని ఎంపీలు పేర్కొన్నారు. మా సస్పెన్షన్‌ కు నిరసనగా నిన్న ఈ ఆందోళన చేస్తున్నామన్న ఆయన రాత్రంతా ఇక్కడే ఉన్నామని అన్నారు. మాతో మాట్లాడటానికి కేంద్రం నుంచి ఎవరూ రాలేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇక రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయానికి ప్రధానితో సహా పలువురు మద్దతు లభిస్తోంది. తనతో అమర్యాదగా ప్రవర్తించిన ఎంపీలకు స్వయంగా టీ ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని ప్రధాని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version