కర్ణాటక సీఎంకు ఊహించని పరిణామం ఎదురైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైనీ లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ వినూత్న రీతిలో విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తరహాలో PayCM అంటూ పోస్టర్లు బుధవారం బెంగుళూరు నగరంలోనీ పలు ప్రాంతాల్లో అంటించింది. ఈ పోస్టర్లు ఎలక్ట్రానిక్ వాలెట్ Paytm ప్రకటనల మాదిరిగానే ఉన్నాయి. QR కోడ్ మధ్యలో “40% ఇక్కడ అంగీకరించబడింది” అనే సందేశం తో బసవరాజు బొమ్మై ముఖచిత్రం ఉంచారు.
ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్లు తీసుకుంటుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఈ పోస్టర్లను తొలగించారు.
A super brilliant campaign by Congress party in Karnataka.#PayCM for 40% commission. pic.twitter.com/xU5LuQUVOP
— Ankit Mayank (@mr_mayank) September 21, 2022