మ‌రో పోరాటానికి సిద్ధం అయిన రాకేష్ టికాయ‌త్

-

ప్ర‌స్తుతం దేశం లో రాకేష్ టికాయ‌త్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. మూడు సాగు చ‌ట్టాల ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ తో దేశం లో ఉన్న రైతులంద‌రినీ ఒక తాటి కి పైకి తీసుకువ‌చ్చిన నేత రాకేష్ టికాయ‌త్. అంతే కాకుండా ఆయ‌న వ్యూహాల తో కేంద్ర ప్ర‌భుత్వం తో నే క్ష‌మాప‌ణ లు చెప్పించాడు. అయన ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాతినిథ్యం వ‌హించిన రైతు ఉద్యమం విజ‌యం సాధించ‌డం తో మ‌రో పోరాటానికి సిద్ధం కావాల‌ని అంటున్నారు.

దేశ వ్యాప్తం గా ఉన్న బ్యాంకు ల‌ను ప్రయివేటీక‌రం చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని అన్నారు. అంతే కాకుండా ఈ బిల్లు ను కూడా త్వ‌రలో పార్లమెంట్ లో ప్ర‌వేశ పెట్టే అవ‌కాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. మ‌న బ్యాంక్ ల‌ను మ‌న మే ర‌క్షించు కోవాలని అన్నారు. ప్ర‌భుత్వ బ్యాంకు ల‌ను ప్రయివేటు ప‌రం చేయ‌వ‌ద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని చాలా కోరామ‌ని గుర్తు చేశారు. అయినా.. కేంద్ర ప్ర‌భుత్వం బ్యాంకు ల‌ను ప్ర‌యివేటు ప‌రం చేయ‌డానికి రంగం సిద్ధం చేసింద‌ని అన్నారు. దీని కి వ్య‌తిరేకం గా దేశ వ్యాప్తం గా ఉద్య‌మాలు చేస్తామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news