ఇకపై ఫ్రిజ్​లో పెట్టకపోయినా టమాటలు 15 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయట.. ఎలాగో తెలుసా..?

-

కూరగాయలు సాధారణంగా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. ఒకవేళ ఉన్నా వాడిపోతాయి. ముఖ్యంగా టమాటలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అయితే ధరల పెరుగుదల ఓ వైపు.. ఎక్కువ దిగుబడి వచ్చినా మార్కెట్​కు తీసుకెళ్లేలోగా టమాట పాడైపోవడం మరోవైపు.. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం టమాటను ఎక్కువ కాలం నిల్వ ఉంచడంపై పరిశోధనలు చేశారు లక్నోలోని ‘సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ’ (నేషనల్‌ బొటానికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌).

టమాటాను 5 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉండేట్టు చేయటంలో తమ పరిశోధనలు సఫలీకృతమయ్యాయని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ తాజాగా వెల్లడించింది. టమాటా..పండుగా మారే కాలాన్ని పెంచవచ్చని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్టు అనిరుధా సేనీ తెలిపారు. సుదూర పా్రంతాల నుంచి టమాటా రవాణా సులభతరమవుతుందని, భవిష్యత్తులో వీటి ధరల్ని నియంత్రించవచ్చునని చెప్పారు. వేర్‌హౌస్‌ల్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘టమాటా పండుగా మారేందుకు దోహదపడేది ‘అబ్సెసిక్‌ ఆమ్లం’. జన్యుపరమైన మార్పులతో ఈ ఎంజైమ్‌ను తగ్గించగలిగామని ఎన్‌బీఆర్‌ఐ డైరెక్టర్‌ అజిత్‌ కుమార్‌  చెప్పారు. దీంతో ఎథిలిన్‌ విడుదల ఆలస్యమై..పండుగా మారే ప్రక్రియ నెమ్మదించిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version