ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా… ఇవాళ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రెండో సెమీఫైనల్ జరగనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్ కు చేరింది.
ఇవాళ జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో… గెలిచిన జట్టు మన టీమ్ ఇండియాతో ఫైనల్ ఆడుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ టాస్ గెలిచిన జట్టు… మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా కంటే సౌత్ ఆఫ్రికా కాస్త వీక్ అనిపిస్తోంది. మరి ఇవాళ మ్యాచ్లో ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా ఎలా కొట్టబోతుందో చూడాలి.