‘కుమారి, శ్రీమతి వాడొద్దంటే ఎలా’.. ఓ పిటిషన్​పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

-

కొంతమంది ఆడవారికి తమను ఆంటీ అని పిలిస్తే నచ్చదు. కానీ ఇక్కడ మాత్రం తమ పేరు ముందు మిస్, మిస్సెస్ అని పెడితే నచ్చలేదట కొందరికి. ఈ విషయంలోనే వారు ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిరంతరం కీలక కేసులతో బిజీగా ఉండే సర్వోన్నత న్యాయస్థానానికి ఇలాంటి సిల్లీ పిటిషన్​ను విచారించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తమ పేరు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగకూడదని, ఈ మేరకు ఆదేశాలివ్వాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం రోజున సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది ప్రచారానికి దాఖలు చేసిన దావాలా కనిపిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.

‘‘మీరు మా నుంచి ఏ ఊరట కోరుకుంటున్నారు. ప్రచారానికి వేసినట్లు ఉంది. కుమారి, శ్రీమతి లాంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా వాడాలనుకుంటే.. వారినెలా నిరోధిస్తారు. ఇందుకొక సాధారణ పద్ధతి అంటూ లేదు. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా లేదా అన్నది ఆ వ్యక్తి ఎంపికననుసరించి ఉంటుంది’’ అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది

Read more RELATED
Recommended to you

Exit mobile version