ట్విట్టర్ కు సుప్రీం నోటీసులు…!

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ లో కాకుండా జమ్మూ కాశ్మీర్‌ లో ఒక భాగంగా లేహ్ జిల్లాను చూపించినందుకు వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ కు నోటీసులు జారీ చేసింది. తప్పు మ్యాప్ చూపించి భారతదేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు దానిపై చట్టపరమైన చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరించాలీ అని, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ కు ఐదు రోజులు సమయం ఇచ్చింది.

twitter
twitter

నవంబర్ 9 న నోటీసు పంపినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అలాగే లడఖ్ గా విభజించారు. లేహ్ లడఖ్‌ రాజధానిగా ఉంది. అంతకుముందు, ట్విట్టర్ లేహ్‌ ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా చూపించింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి… ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సేపై అభ్యంతరం వ్యక్తం చేశారు