టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కళాశాలకు రావొద్దు

-

సాధారణంగా పాఠశాలలకు యూనిఫామ్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో కళాశాలకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇంకొన్ని వాటిల్లో డ్రెస్ కోడ్ అంటూ ఏం లేకపోయినా.. పర్టిక్యులర్ దుస్తులు మాత్రం కళాశాలలకు ధరించకూడదని నిబంధనలు ఉంటాయి. తాజాగా ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ కూడా ఇలాంటి నిబంధనలే తమ విద్యార్థులకు విధించింది. ఇప్పటికే కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుని వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ అదేంటంటే?

ఇక నుంచి విద్యార్థులెవరూ కళాశాలకు టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్‌(టోన్‌)పైనా ధరించి రాకూడదని అల్టిమేటమ్ జారీ చేసింది. తమ కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబయిలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని స్పష్టం చేసింది. ఫార్మల్, డీసెంట్‌ దుస్తులతో పాటు హాఫ్‌ లేదా ఫుల్‌ షర్ట్, ప్యాంటు ధరించాలని పేర్కొంది. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్‌ 27వ తేదీన నోటీసు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version