పీఎఫ్ డబ్బులకీ టాక్స్.. వచ్చే ఏడాది నుండే అమలు…

-

సాధారణంగా పీఎఫ్ డబ్బులకి ఎలాంటి టాక్స్ ఉండదు. కానీ ఇక ముందు అలా ఉండబోదు. మారుతున్న కాలాల ప్రకారం పీఎఫ్ డబ్బుకీ టాక్స్ కట్టాల్సి ఉంటుందట. ఉద్యోగికి పీఎఫ్ డబ్బుల మీద ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి టాక్స్ వర్తింపజేయాలన్న ఆలోచనని కేంద్ర ప్రభుత్వం చేసింది. బడ్జెట్ 21-22 లో తీసుకున్న అనేక నిర్ణయాల్లో ఇది కూడా ఉంది. ఐతే ఈ వర్తింపు వచ్చే సంవత్సరం నుండి వర్తించనుందట. ఐతే ఇక్కడ చిన్న సవరణ ఇచ్చారు.

ఎవరి ఆదాయం నుండి సంవత్సరానికి 2.5లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ కి వెళ్తుందో వారిపై ఈ టాక్స్ విధించనున్నారట. అంటే మీ పీఎఫ్ అమౌంట్ సంవత్సరానికి 2.5లక్షలు దాటితేనే టాక్స్ పడుతుందన్న మాట. సంవత్సరానికి 2.5లక్షలు పీఎఫ్ కి వెళ్తుంటే వారి సంపాదన మరో రేంజిలోనే ఉంటుంది. అదీగాక దానికి వారు 8శాతం వడ్డీ పొందుతున్నారు. అందుకే ఆ అమౌంట్ పై పన్ను విధించాలని డిసైడ్ అయ్యారట.

ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి నెలకి కోటి రూపాయలు సంపాదించాడుకుంటే పీఎఫ్ కి పెద్ద అమౌంటే వెళ్తుంది. ఆ అమౌంట్ కి 8శాతం వడ్డీ వస్తుంది. అందుకే పీఎఫ్ డబ్బులు 2.5లక్షలు దాటితే పన్ను కట్టాల్సి ఉంటుందని చెబుతున్నాం. అది వచ్చే సంవత్సరం నుండి అమలులోకి రానుందని తెలిపారు. బడ్జెట్ వస్తుందంటే టాక్సు స్లాబులని మరింత పెంచి సామాన్యుడి మీద పన్ను భారం పడకుండా చూస్తారని ఎదురుచూస్తారు. అలా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురయ్యింది. అదీగాక ఎక్కువ సంపాదించేవారిపై పీఎఫ్ పై టాక్స్ అని చెప్పి అదనపు భారం పడేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news