NCP నేత శరద్ పవార్ ముంబై నుంచి బెంగళూరు బయలుదేరారు. రెండో రోజు నేడు జరగనున్న విపక్ష సమావేశంలో పవార్ పాల్గొననున్నారు. NCPలో చీలిక, మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో విపక్షాల సమావేశానికి పవార్ హాజరుపై సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు దానికి తెరపడింది. నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విపక్షాల కీలక సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు.
కాగా వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఉమ్మడిగా ఎదుర్కోవడమే లక్ష్యంగా నిన్న బెంగళూరులో జరిగిన భేటీకి కొనసాగింపుగా ఇవాళ 26 విపక్ష పార్టీల నేతలు మేదోమధనం చేయనున్నారు. కూటమికి ఇండియా పేరు కలిసేలా కొత్త పేరును ఖరారు చేయనున్నారు. యునైటెడ్ వుయ్ స్టాండ్ అన్నది ట్యాగ్ లైన్ గా ఉంటుందని సమాచారం. చైర్మన్ గా సోనియా, కన్వీనర్ గా నితీష్ ఉంటారని తెలుస్తోంది. వీటన్నిటిపై నేడు క్లారిటీ రానుంది.