పొలార్డ్ వల్లే.. ఈ స్థాయికి వచ్చా – తిలక్ వర్మ

-

హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ టీమిండియాకు ఎంపిక అయ్యారు. వెస్టిండీస్ తో జరగనున్న టి 20 సిరీస్లో ఆడనున్నారు. IPLలో ముంబై తరఫున ఆడుతున్న తిలక్ వర్మ తన ఆటతీరుతో అందరిని మెప్పించారు. ఐపీఎల్-2022లో 397 రన్స్, ఐపిఎల్-2023లో 343 రన్స్ చేసి రానించారు. తిలక్ కి టీమిండియా తరఫున మూడుసార్లు ఆడే సత్తా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

అయితే.. తాను టీమ్ఇండియాకు ఎంపికైన విషయం తెలియగానే అమ్మానాన్న కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ చెప్పారు. వాళ్లతో వీడియో కాల్ మాట్లాడానని… చాలా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. ‘ప్రపంచకప్ మ్యాచులో 40-50 పరుగులకు నాలుగైదు వికెట్లు పడినప్పుడు జట్టును నేనెలా ముందుకు తీసుకెళ్తాననే దానిపైనే నేను ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటా’ అని తెలిపారు తిలక్. కిరాన్‌ పోలార్డ్‌ సూచనల మేరకు తాను రాణించానని తిలక్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version