యూపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం.. స‌మ్మెలు నిషేధం

-

యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం తో ఆరు నెల‌ల పాటు రాష్ట్రంలో ఉద్యోగులు స‌మ్మెలు చేయ‌డానికి వీలు లేదు. ఒక వేళ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి స‌మ్మెలు చేస్తే.. చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని యూపీ స‌ర్కార్ హెచ్చ‌రించింది. దీనికి సంబంధించిన ఎస్మా చ‌ట్టాన్ని ప్ర‌యోగించారు. దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను యూపీ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ దేవేష్ కుమార్ చ‌తుర్వేది జారీ చేశారు.

కాగ ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు స‌మీపించ‌డం తో పాటు రాష్ట్రంలో క‌రోనా వైరస్ విస్తిరిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రిస్తే.. ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ. 1000 జ‌రిమానా.. లేదా రెండు విధించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కాగ ఉత్తర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌తంలో మే నెల‌లో కూడా ఉద్యోగుల పై ఎస్మా ప్ర‌యోగించింది.

Read more RELATED
Recommended to you

Latest news