Viral: క్రిస్ గేల్ ను కలిసిన విజయ్ మాల్యా.. ఫోటోలు వైరల్

-

బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని 2017 లో లండన్ పారిపోయిన విజయ్ మాల్యా తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ను కలిసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రారంభంలో మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యాజమాన్యంలోని వుండేది. వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంవత్సరాలుగా ఆర్సిబి జట్టు కోసం ఆడి సంచలనం సృష్టించారు.

బ్యాంకులను మోసగించిన విజయ్ మాల్యా తన మాజీ స్నేహితుడైన ప్రముఖ క్రికెటర్ గేల్ తో సమావేశమైన తరువాత తన ట్విట్టర్ హ్యాండిల్ లో చిత్రాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.” నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ గేల్ ను కలుసుకోవడం బాగుంది. నేను అతన్ని ఆర్సిబి జట్టు లోకి రిక్రూట్ చేసినప్పటి నుంచి సూపర్ స్నేహం ఏర్పడింది. అత్యుత్తమ ఆటగాడిని కొనుగోలు చేశాను.” అని మాల్యా ట్విట్టర్లో రాశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version