ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌

క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో ఢిల్లీలోని అర‌వింద్ కేజ్రివాల్ సర్కార్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వీకెండ్ క‌ర్ఫ్యూను కేజ్రివాల్ సర్కార్ ఎత్తివేసింది. అంతే కాకుండా ప‌లు నింబంధ‌న‌ల‌ను కూడా స‌డ‌లించింది. కాగ గ‌త కొద్ది రోజుల ముందు ఢిల్లీలో క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భ‌యాందోళ‌న ప‌రిస్థితిలో ఉండేది. ప్ర‌తి రోజు దాదాపు 20 వేల కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండేవి.

అయితే గ‌త రెండు మూడు రోజుల నుంచి ఢిల్లీలో క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. బుధ వారం ఢిల్లీలో రాష్ట్రంలో 7,498 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఢిల్లీ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వీకెండ్ క‌ర్ఫ్యూ ను ప్ర‌భుత్వం ఎత్తివేసింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల‌ను కూడా కేజ్రివాల్ ప్ర‌భుత్వం ఎత్తి వేసింది. దీంతో ఢిల్లీలో అమ‌లులో ఉన్న దుకాణాల స‌రి – బేసి విధానాన్ని ఎత్తివేసింది. అలాగే బార్లు, రెస్టారెంట్లు ల‌లో 50 శాతం కేపాసిటితో తెర‌వ‌చ్చ‌ని తెలిపింది. కాగ ఢిల్లీలో పాఠ‌శాల‌ల ఓపెనింగ్ అంశం పై ఢిల్లీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.