కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష అందిస్తామని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొ.కోదండరాం, కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో.. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఉచిత పథకాలు అమలు చేస్తే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని అంటున్నారని రాహుల్ విమర్శించారు.

తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జాబితా తయారు చేసి.. ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీరుస్తాం. గ్రాడ్యుయేట్స్ కు ఏడాది గ్యారెంటీ స్కీం అమలు చేస్తాం. ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉధ్యోగాలు కల్పిస్తాం. ఏడాది తరువాత ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని రాహుల్ చెప్పారు. 30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆదివాసీలకు జల్ జమీన్ జంగల్ పై హక్కులు కల్పిస్తామని రాహుల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version