రాఫెల్ యుద్ధ విమానాల గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయమై జరిగిన అనేక వాదోపవాదాలు రాఫెల్ విమానాల గురించి అందరికీ తెలిసేలా చేసింది. ఐతే తాజాగా ఫ్రాన్స్, ఐదు యుద్ధ విమానాలని భారత్ కి పంపింది. ఈ యుద్ధ విమానాలు అంబాలా స్థావరానికి చేరుకున్నాయి. ఐతే రాఫెల్ యుద్ధ విమానం నడిపేందుకు మహిళ సిద్ధమవుతుందని వినిపిస్తుంది. అధునాతన సాంకేతికతో కూడిన యుద్ధ విమానాన్ని మహిళ నడిపేందుకు శిక్షణ తీసుకుంటుందని సమాచారం.
యుద్ధ విమానాలని మహిళలు నడపడం చాలా అరుదు. అలాంటిది కొత్తగా భారత్ కి వచ్చిన రాఫెల్ విమానాలని నడపడానికి శిక్షణ పొందుతున్న మహిళ ఎవరనేది ఆసక్తిగా మారింది. రక్షణ శాఖ ఈ సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటుందని, ఆ తర్వాత వివరాలు వెల్లడి చేస్తారని అంటున్నారు.