నవగ్రహ దోషాలు పోవాలంటే ఈ మంత్రాలను మననం చేయండి!!

-

అందరూ శని పీడిస్తుంది, గురువు బాగులేడు, రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు, జప, తర్పణ,హోమాలు చేయించడం సాధ్యం కాదు. అయితే వారు భక్తి, శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ. ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం…

నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. న గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అంటే తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం. గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో తొలుత వివరించారు. గాయత్రి అనే పదం గయ త్రాయతి అను పదాలతో కూడుకుని ఉంది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆదిశంకరాచార్యులు తనభాష్యంలో వివరించారు. గాయత్రి మంత్రాన్ని రూ జపించవచ్చు. కాకపోతే కొన్ని నియమనిబందనలుఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. ఇక నవగ్రహ గాయత్రీ మంత్రాలు ఆయా గ్రహాలకు…


సూర్య గాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే!
మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్!!
చంద్ర గాయత్రి: ఓం అమ్రుతేశాయ విద్మహే!
రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్!!
కుజ గాయత్రి: ఓం అన్గారకాయ విద్మహే!
శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజః ప్రచోదయాత్!!
బుధ గాయత్రి: ఓం చంద్ర సుతాయ విద్మహే!
సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్!!
గురు గాయత్రి: ఓం వృషభద్వజాయ విద్మహే!
కృణి హస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!!
చంద్ర గాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే!!
దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!!
శుక్ర గాయత్రి: ఓం భార్గవాయ విద్మహే!
మంద గ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్!!
రాహు గాయత్రి: ఓం శీర్ష రూపాయ విద్మహే!
వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్!!
కేతు గాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే!
ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్!!

ఎవరెవరికి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రీని ప్రాతఃకాలమందే స్నానం ఆచరించి శుభ్రవస్త్రధారియే శౌచాశౌచాలు పాటిస్తూ పఠిస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version