BREAKING : నివ్వెరపోయేలా చేస్తున్న నవీన్‌ హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌

-

హైదరాబాద్ లోని అబ్దుల్లా పూర్ మెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి హత్యోదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. నవీన్‌ హత్య కేసు రిమాండ్ రిపోర్టులోని విషయాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.తన ప్రేమకు అడ్డుపడుతున్నాడనే కారణంతో హరిహరకృష్ణ నవీన్‌ను దారుణంగా హతమార్చాడు. ఇందుకోసం 3 నెలల ముందే నుంచే నిందితుడు హరిహరకృష్ణ నవీన్‌ హత్యకు కుట్రపన్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిందితుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడని తెలిపారు.ఈ నెల 17న మద్యం మత్తులో యువతి విషయంలో నవీన్ హరిహరకృష్ణ మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో హరిహరకృష్ణ నవీన్‌ను ఓఆర్ఆర్ సమీపంలో గొంతునులిమి హత్య చేశాడని చెప్పారు.

అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని వెళ్లాడని వివరించారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లికి చేరుకొని నవీన్‌ అవయవాలు పారేశాడని వివరించారు.నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌కు తెలియజేశాడని పోలీసులు అన్నారు. మరుసటిరోజు ప్రియురాలికి హత్య విషయాన్ని నిందితుడు చెప్పాడని పేర్కొన్నారు. హత్య తర్వాత నిందితుడు వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖలో తిరిగాడని గుర్తించారు. ఈనెల 24న మరోసారి హత్య చేసిన స్థలానికి వెళ్లినట్లు హరిహరకృష్ణ అంగీకరించాడు. అప్పుడు మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అదేరోజు సాయంత్రం పోలీసుల ఎదుట హరిహరకృష్ణ లొంగిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version