ఏజెంట్ ఆత్రేయతో అమెజాన్ లో కొరటాల వెబ్ సిరీస్..?

-

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన నవీన్ పోలిశెట్టికి మంచి హిట్ లభించింది. ఆ సినిమాలో నవీన్ నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఐతే ఆ తర్వాత బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నవీన్ చేతిలో జాతిరత్నాలు అనే సినిమా ఉంది.

ఐతే తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ వెబ్ సిరీస్ రూపొందుతుందని టాక్ వినబడుతుంది. కొరటాల శివ నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుందట. అమెజాన్ ప్రైమ్ కోసం నిర్మితమవుతున్న ఈ సినిమాకి కొరటాల శివ కథ అందిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం లేనప్పటికీ మరికొద్ది రోజుల్లో అధికారికంగా రివీల్ చేస్తారట. కొరటాల అసిస్టెంట్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తాడట.

Read more RELATED
Recommended to you

Latest news