సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా ప్రముఖ సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మహాబలిపురం లో ఉదయం ఒక్కటి కాబోతున్నారు. ఈ నూతన వధూవరులను ఆశీర్వదించ డానికి ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అంటూ వీరిపై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక పోతే వీరి పెళ్లికి హాజరైన అతిథులు కూడా డ్రెస్ కోడ్ ను పాటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే కత్రినాకైఫ్ లాగే వీరు కూడా తమ వివాహానికి సంబంధించిన విషయాలను వివరాలను అతిథులకు తప్ప మరెవ్వరికి తెలియనివ్వలేదు అని సమాచారం.
తమ వివాహ వేడుకను పురస్కరించుకుని.. ఒకరికి మరొకరు ఖరీదైన కళ్ళు చెదిరే కానుకలు ఇచ్చుకోవడం గమనార్హం. అంతే కాదు విఘ్నేష్, నయన్ కి ఖరీదైన ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. వివాహానంతరం నయనతార బహుమతిగా ఇచ్చిన కొత్త ఇంటిలో వీరిద్దరు కాపురం పెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సెలబ్రిటీల పెళ్లి వివాహం మాత్రం సినీ ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.