తానూ ఉద్య‌మ‌కారుడినే అన్న గంగుల‌.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజ‌న్లు

-

ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌లోనే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఉద్య‌మ కారులం మేమ‌ని కొంద‌రు, లేదు మాక్కూడ ఆపేరుందంటూ మ‌రి కొంద‌రు నేత‌లు ప్ర‌క‌టించుకుంటున్నారు. ఈట‌ల వ్య‌వ‌హారంతో ఒక్క‌సారిగా టీఆర్ ఎస్‌లో అస‌లు ఉద్య‌మ‌కారులెవ‌రు అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇదే క్ర‌మంలో ఈట‌ల రాజేంద‌ర్‌ను టార్గెట్ చేస్తున్న గంగుల క‌మ‌లాక‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది.

గంగుల క‌మ‌లాక‌ర్‌కు ఉద్య‌మంతో సంబంధం లేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అంటే.. లేదు నాక్కూడ ఉద్య‌మంలో భాగం ఉంది. నేను కూడా ఉద్య‌మ‌కారుడినే అంటూ గంగుల చెప్పుకొచ్చారు. దీంతో ఒక్క‌సారిగి సోష‌ల్‌మీడియా ఆయ‌న‌పై భ‌గ్గుమంటోంది.

నెటిజ‌న్లు ఆయ‌న్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఉద్య‌మంలో మీరు ఏ జిల్లాలో నిర‌స‌న తెలిపారు అని కొంద‌రు, ఆయ‌న ఆంధ్రా ఉద్య‌మంలో ఉన్నారంటూ మ‌రి కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఉద్య‌మంతో సంబంధం లేని వ్య‌క్తి పెద్ద జోక్ చేస్తున్నాడంటూ మ‌రి కొంద‌రు ఆడుకుంటున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version