కొత్తగా ‘కొత్త’ మంత్రులు: ఇలా ఉన్నారేంటి అన్న!

-

ఎక్కడైనా రాజకీయాల్లో మంత్రులు అనేవారు బాగా హైలైట్ అవుతారు…అసలు సీఎం తర్వాత వారే ప్రజలకు తెలుస్తారు…కానీ ఏపీలో మాత్రం చాలా విచిత్రంగా ఉంది…కేవలం జగన్ వన్ మ్యాన్ షో నడవడం వలనో…లేక మంత్రులే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారో తెలియడం లేదు గాని..చాలామంది మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. అయితే కొద్దో గొప్పో ముందు మంత్రులుగా పనిచేసిన వారు కాస్త జనాలకు తెలిశారు…కానీ కొత్తగా వచ్చిన వారు మాత్రం మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. అసలు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ఎవరు ఏ శాఖ మంత్రి అనేది కూడా తెలియడం లేదు

.అంటే ఏపీలో మంత్రుల పరిస్తితి అలా ఉంది…గతంలో కొందరు మంత్రులు నిత్యం మీడియాలోకి వచ్చి చంద్రబాబు, పవన్ ని తిట్టడం వల్ల కాస్త హైలైట్ అయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి వారు జనాలకు తెలిశారు.  కానీ ఇప్పుడు ఏదో ముగ్గురు, నలుగురు తప్ప మిగతా వారు ప్రజలకు తెలియడం లేదు. ఎలాగో పాత మంత్రులైన పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అప్పలరాజు లాంటి వారు ప్రజలకు తెలుస్తున్నారు. అలాగే కొత్తవారిలో రోజా, రజిని, అంబటి రాంబాబు, జోగి రమేశ్, అమర్నాథ్ లాంటి వారు కాస్త మీడియాలో కనిపించడం వల్ల ప్రజలకు తెలుస్తున్నారు.

మిగిలిన పాత, కొత్త మంత్రులు అసలు మంత్రులనే సంగతి ప్రజలకు తెలియడం లేదు. ఉషశ్రీచరణ్, జయరాం, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, రాజన్న దొర లాంటి వారు మంత్రులనే సంగతి తెలియడం లేదు. ఇక హోమ్ మంత్రి వనిత గురించి జనాలకు తెలియడం లేదు. అలాగే సీనియర్ మంత్రులైన ధర్మాన ప్రసాద్ రావు, బొత్స లాంటి వారు పెద్దగా హైలైట్ కావడం లేదు. మొత్తానికి  కొత్త మంత్రులు హైలైట్ అవ్వాలసిన అవసరముంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version